నేడు రాష్ట్రంలో రాహుల్ పర్యటన

Published on 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రం, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ సభలకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నిర్మల్‌ కలెక్టరేట్‌ రోడ్డులో ఉన్న క్రషర్‌ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క విలేకరులకు చెప్పారు. నిర్మల్‌, ముథోల్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి 65 వేల మందిని రాహుల్‌ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించే సభకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, ఈ నెల 9వ తేదీన రాహుల్‌ గాంధీ రెండో దఫ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిస్తోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form