పాట్నా: బీహార్‌లోని హాజీపూర్‌లో కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు.
యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ఎస్డీపీవో ఓంప్రకాశ్ తెలిపారు. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు.