ప్రియాంకపై ఓవైసీ ఆగ్రహం…మీ అన్న ఓటమికి కారణమెవరో చెప్పు..?

Published on 

కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలోని రాయ్‌బరేలీలో గురువారం ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీతో కలిసి ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు. ‘‘ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఇతర పార్టీలను వెనక్కి నెట్టడానికి బీజేపీని గెలిపించేందుకు అతను పనిచేస్తున్నాడు. ఇది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది’’ అని ఆమె ఆరోపించారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగానే స్పందిచారు. ” రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ప్రస్తావించారు. అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో తన పార్టీ కానీ, తాను కానీ పోటీ చేయలేదనే విషయాన్ని” ఓవైసీ ఎత్తి చూపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో లౌకిక రహిత పొత్తులు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ని విమర్శించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో మీకు పొత్తు ఉంది. అతను లౌకికవాదా..? ఇదే శివసేన కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీని ధ్వంసం చేశారు. మీరు వారితో ఉన్నారు’’ అని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆప్ జమ్మూ కాశ్మీ్ర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంలో బీజేపీకి సాయం చేసింది. మీరు మమ్మల్ని బీజేపీ B-టీమ్ అని పిలుస్తారా..? అని అసద్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు బీజేపీపై పోటీ చేసి 92 శాతం స్థానాల్లో ఓడిపోయారు. ఈ సారి 300 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఈ సారి ఎన్ని గెలుస్తారో చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించారు ఒవైసీ.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form