వివాదాల్లో అమీర్ ఖాన్ కొడుకు

Published on 

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్. అమీర్‌ఖాన్‌, రీనాద‌త్తా ల ముద్దుల తనయడే జునైద్ ఖాన్. అతని గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పీకే సినిమాతో పాటు తండ్రి అమీర్ ఖాన్ న‌టించిన అనేక బాలీవుడ్ సినిమాల‌కు జునైద్‌ఖాన్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు జునైద్. తాజాగా జునైద్ వివాదంలో చిక్కుకున్నాడు.

వివరాల్లోకి వెళితే మ‌హారాజ్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జునైద్ హీరోగా సిద్దార్థ్ పి మ‌ల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహారాజ్. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మ‌రో రెండు సినిమాల్లో అత‌డు హీరోగా న‌టించ‌బోతున్నాడు. కానీ, మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వివాదాల్లో ఇరుక్కుంది.

దీనికి కారణం ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్వి. ఈ సినిమాలో జునైద్ హిందు మ‌తాన్ని, ఆచారాలు, సంస్కృత‌ల‌ను మ‌హారాజ్ మూవీతో వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసినట్లు చెప్తున్నారు. హిందూ సాధువుల‌ను, స‌న్యాసుల‌ను కామంధులుగా చిత్రీక‌రిస్తూ వారిని మ‌హారాజ్ మూవీతో అవ‌మానించాల‌ని చూస్తున్నట్లు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే ఈ సినిమాను అడ్డుకోవాలని హిందూ పెద్దలు కోర్టును ఆశ్రయించారు.కోర్టు ఈ సినిమాను జూన్ 18 కి వాయిదా వేసింది. ఈలోపు విచారణ చేపట్టాలని కోరింది.

ఇక ఇంకోపక్క నెట్ ఫ్లిక్స్ మీద కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form