బీజేపీ ఆఫీసులో ముద్దులతో నిరసన..!

Published on 

బీజేపీ ఆఫీస్‌ వద్ద ఒక జంట ముద్దుల్లో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని వైశాలి నగర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఓయో రూమ్స్‌ ముసుగులో వ్యభిచార వ్యాపారం జరుగుతోందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆరోపించారు. పోలీసులతో కలిసి ఓయో హోటల్స్‌పై దాడులు చేయించి వాటిని మూసివేయించారు. కాగా, భార్యాభర్తలు దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ క్యాంపు కార్యాలయం బయట ముద్దుల్లో మునిగిపోయారు. వైశాలి నగర్‌లో ఓయో రూమ్స్‌ను ఆ ఎమ్మెల్యే మూయించడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇది చూసేందుకు జనం అక్కడ గుమిగూడారు.

మరోవైపు అక్కడకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆ దంపతుల ప్రవర్తనను నిలదీశారు. అయితే ఆ ప్రాంతంలోని ఓయో రూమ్స్‌ను ఆయన మూయించడంతో తాము ఎక్కడికి వెళ్లలేకపోతున్నట్లు వారు చెప్పారు.

అయితే గతంలో రికేష్ సేన్ పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన జంటలను కౌన్సిలింగ్ ఇస్తు, పిల్లలు, పెద్దలు ఆడుకునే స్థలాల్లొ జంటలుగా సన్నిహితంగా ఉండటాన్ని తప్పుపడుతూ వాళ్లను మందలించిన ఘటనలు వున్నాయి. అటు పార్కులు, ఇటు ఓయో రూమ్స్ మూసివేస్తుంటే నిరసనగానే బీజేపీ ఆఫీసులో ఇటువంటి కార్యక్రమానికి పిలునిచ్చినట్లున్నారు అంటున్నారు స్థానిక యువత.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form