కూతురుకి మద్దతుగా దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమని విజయమ్మ నిలిచారు. కడప లోక్ సభ నుండి పోటీ చేస్తున్న తన కూతురు షర్మిలకు మద్దతునివ్వాలని ప్రజలను కోరుతూ ఓ వీడియో సందేశాన్ని శనివారం ఉదయం విడుదల చేశారు ఆమె.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకూ, కూతురు ఒకరికొకరు ప్రత్యర్ధులుగా నిలబడిన తరుణంలో, ‘రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ’ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్.విజయమ్మ ఈ వీడియో సందేశం ప్రాధన్యత సంతరించుకున్నది.
ఆ వీడియో సందేశంలో ఆమె…‘యావత్ కడప లోక్‌సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర్ రెడ్డి గారిని ఏవిధంగానైతే మీరు అభిమానించారో, ఏవిధంగా హక్కున చేర్చకున్నారో, ఏవిధంగా నిలబెట్టుకున్నారో, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శర్మిలమ్మ కడప పార్లమెంట్‌కు కంటెస్ట్ చేస్తుంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వాధించమని, పార్లమెంట్‌కు పంపమని…ఆయన లాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకు ఇవ్వమని మిమ్మల్నందరినీ ప్రార్ధిస్తున్నాను.’’ అంటూ వీడియో సందేశం విడుదల చేసింది.

అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను.
— YS Sharmila (@realyssharmila) May 11, 2024
కడప ప్రజలకు అమ్మ విన్నపం :
వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప… pic.twitter.com/xvEiMOZ89Y