నా తల్లిని అత్యాచారం చేశారు..నన్ను లైంగికంగా వేధించారు

Published on 

జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ దురగాతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ బాధిత మహిళ వీస్తూపోయే విషయాలు బయట పెట్టింది. తన తల్లిపై జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డారని, తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించింది.

ఎంతో మంది మహిళపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. దాదాపుగా 3000 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీకి వెళ్లారు.

రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహిళ కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేయగా, ప్రజ్వల్ రేవణ్ణను దేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2020-2021 మధ్య ప్రజ్వల్ రేవణ్ణ తనను బెదిరించాడని, తన తల్లికి హాని చేస్తానని బెదిరించి, తన బట్టలు తొలగించామని భయపెట్టినట్లు ఆరోపించింది. ‘‘ అతను నాకు ఫోన్ చేసి నా బట్టలు తీసేయమని కోరాడు. మా అమ్మ మొబైల్‌కి ఫోన్ చేసి వీడియో కాల్స్‌కి సమాధానం ఇవ్వాలని నన్ను బలవంతం చేసేవాడు. నేను నిరాకరిస్తే, మా అమ్మకు హాని చేస్తానని బెదిరించే వాడు. అతనిపై ఫిర్యాదు చేసిన సమయంలో తన కుటుంబం తమకు మద్దతు ఇచ్చింది’’ అని యువతి వెల్లడించింది. నా తల్లిని హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలు రేప్ చేసి లైంగికంగా వేధించారని, ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించాడని మహిళ ఆరోపించింది.

తనకు సహకరించకుంటే తన భర్త ఉద్యోగాన్ని తీయించేస్తానని, తన కుమార్తెపై కూడా అత్యాచారం చేస్తానని ప్రజ్వల్ బెదిరించేవాడని సదరు మహిళ తెలిపింది. తాము కంప్లైట్ ఇచ్చిన తర్వాత తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పింది. 2020-21 మధ్య జరిగిన నిరంతర వేధింపులు తన కుటుంబంపై భారీ నష్టాన్ని చూపించాయని, వీరి ఆగడాలు తట్టుకోలేక ఫోన్ నెంబర్లు మార్చాల్సి వచ్చిందని చెప్పారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form