తిరుపతిలో విషాదం..నీట మునిగి తల్లి,కుతుళ్లు మృతి

Published on 

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో దీపం వదిలేందుకు తల్లి,కుతుళ్లు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌ పురంలో నివాసముంటున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ భార్య శాంతి శివాలయం వద్ద ఉన్న చెరువులో దీపం వదిలేందుకు కుమార్తెల తో కలిసి వెళ్లింది. మెట్లపై నుంచి చెరువులోకి దిగుతుండగా పాచికారణంగా కుమార్తెలు జారిపడి చెరువులో పడిపోయారు.

కుమార్తెలను కాపాడేందుకు చెరువులో దిగిన తల్లి సైతం కొట్టుకుపోతుండగా ఆమె చేసిన అరుపులకు స్థానికులు వచ్చి ఆమె కాపాడారు. ఈ ఘటనలో కుమార్తెలు చరిత(13), రూపిక(10), రిషిక (9) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో గాలింపులు జరిపి మృతదేహాలను బయటకు తీశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form