మోదీతోనే నా పయనం…

Published on 

కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపినరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఆదివారంనాడు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే అయితే, కొత్త బాధ్యతల నుంచి తనను రిలీవ్ చేయాలని సురేష్ గోపి కోరుకుంటున్నట్టు మీడియోలో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై సురేష్ గోపి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. మోదీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అయితే త‌న‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించి కేరళ మీడియా కథనాన్ని కూడా ప్రచురించింది. ‘‘కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి న‌న్ను రిలీవ్ చేస్తార‌ని భావిస్తున్నాన‌ని, సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంద‌ని, ఈ అంశంపై కేంద్ర నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని, ఒక ఎంపీగా తాను త్రిసూరులో మెరుగైన సేవ‌లు అందిస్తాన‌ని, త‌న‌కు క్యాబినెట్ పొజిష‌న్ అవ‌స‌రం లేద‌ని’’ సురేశ్ గోపి అన్నట్లుగా మీడియా కథనాన్ని ప్రచురించింది.

అలాగే, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీకి రావాల‌ని పిలిచిన‌ప్పుడు.. బీజేపీ కేంద్ర నాయ‌కుల‌తో త‌న సినిమా క‌మిట్‌మెంట్ల గురించి సురేశ్ గోపి చెప్పిన‌ట్లు కూడా తెలుస్తోంది. సురేశ్ గోపి ప్ర‌స్తుతం నాలుగు చిత్రాల్లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌యంపై తీస్తున్న చారిత్ర‌క నేప‌థ్య‌ చిత్రంలోనూ ఆయ‌న న‌టిస్తున్నారు. ఒక‌వేళ సినిమాల‌ను ఆపేస్తే, అప్పుడు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సిబ్బంది సంక్షోభంలోకి వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సురేశ్ గోపి అన్నట్లుగా ఆ కథనం పేర్కొంది. అయితే
తాజా వార్తలను బట్టీ చూస్తుంటే సురేష్ గోపీ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form