సినిమా ఫక్కిలో డాక్టర్ అరెస్ట్… ఎమర్జెన్సీ వార్డ్‌లోకి పోలీసు జీప్..

Published on 

రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో మహిళా వైద్యురాలిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని డెహ్రాడూన్ పోలీసులు నాటకీయ ఫక్కిలో అరెస్టు చేశారు. అసాధారణమైన రీతిలో పోలీసులు తమ వాహనాన్ని దబాంగ్ సినిమా స్టైల్‌లో నడుపుతూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్‌ ఉండే నాల్గవ అంతస్తు వరకు తీసుకెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.

వాహనం అత్యవసర వార్డులోకి ప్రవేశించడంతో గందరగోళం ఏర్పడింది, దారి క్లియర్ చేయడానికి ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది.. పోలీసు వాహనం వెళ్లేందుకు రోగుల బెడ్లు, స్ట్రెచర్లను హడావుడిగా పక్కకు తరలించాల్సి వచ్చింది.

ఎయిమ్స్-రిషికేశ్‌లోని ప్రీమియర్ హెల్త్ ఫెసిలిటీలో పని చేస్తున్న మహిళా వైద్యురాలిపై అక్కడే పనిచేస్తున్న డాక్టర్ సతీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి ఆవరణలో వేధించాడని, ఆమెకు అసభ్యకరమైన SMS కూడా పంపాడని రిషికేశ్ కొత్వాలి SHO శంకర్ సింగ్ బిష్త్ తెలిపారు.

లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్‌ను అరెస్ట్ చేయాలని సోమవారం డీన్ అకడమిక్స్ కార్యాలయం వెలుపల రెసిడెంట్ వైద్యులు ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిరసనతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే నింధితుడు అరెస్ట్ నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తుండటంలో పోలీసులు అతన్ని సినిమా ఫక్కిలో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form