స‌చిన్ టెండూల్క‌ర్ సెక్యూర్టీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

Published on 

మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జామ్నేర్ ప‌ట్ట‌ణంలోని త‌న స్వంత ఇంట్లో అత‌ను కాల్చుకున్న‌ట్లు తెలుస్తోంది. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఆ పోలీసును ప్ర‌కాశ్ కాప్డేగా గుర్తించారు.

బుధ‌వారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు జామ్నేర్ పోలీసు స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ కిర‌ణ్ షిండే తెలిపారు. సూసైడ్ వెనుక ఉన్న‌కార‌ణాల‌ను క‌నుగునేందుకు పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆ జ‌వాన్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ ద్వారా గుర్తించారు. కాప్డే మృత‌దేహానికి అటాప్సీ చేస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ క‌ల్పిస్తున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం వ‌ల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్య‌క్తిగ‌తంగా ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form