ఢిల్లీ మెట్రోలో రాహుల్ గాంధీ

Published on 

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ప్రోటోకాల్‌ను సహితం పక్కనపెట్టి ఇట్టే సాధారణ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండటం తెలిసిందే. తాజాగా అటువంటి ఘటనే జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సామాన్యులతో ముచ్చటించారు. ప్రస్థుతం రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 25న ఢిల్లీలో పోలింగ్ జరగనుండగా, ఈరోజు(గురువారం) ప్రచారానికి చివరి రోజు కావడంతో రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ పోటీచేస్తుండటంతో రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా మంగోల్‌పురిలో పర్యటించారు. ఆ ర్యాలీకి వెళ్లే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు . ప్రయాణికులతో ముచ్చటించారు.

కాగా.. ప్రచారంలో రాహుల్ గాంధీ మరోమారు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని చింపి, విసిరేయాలని బీజేపీ నిరంతరం కోరుకుంటోందని ఆరోపించారు, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దానిని రక్షించే పోరాటమని నొక్కి చెప్పారు. “ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే పోరాటం. ఇది కేవలం పుస్తకమే కాదు, గాంధీ, అంబేద్కర్, నెహ్రూ జీల వేల సంవత్సరాల సైద్ధాంతిక వారసత్వం. మన రాజ్యాంగానికి ఇంత గొప్ప వారసత్వం కలిగి ఉంది” అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుండగా.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form