అగ్ని జ్ఞానాన్ని నాశనం చేయలేదు : నరేంద్ర మోడీ

Published on 

పట్నా: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వ కట్టడాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు.

బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పదిరోజుల్లోనే నలందలో పర్యటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నలంద అనేది కేవలం పేరు కాదని అది మన గుర్తింపు, గౌరవం అని తెలిపారు. ఆనాడు నలంద యూనివర్సిటీ లైబ్రరీ ధ్వంసమైన ఘటనను గుర్తుచేసుంటూ ‘అగ్ని పుస్తకాలను కాల్చగలవు కానీ జ్ఞానాన్ని ధ్వంసం చేయలేవని పేర్కొన్నారు.

శిథిలమైపోయిన విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని ఈ కొత్త క్యాంపస్‌ను నలంద విశ్వవిద్యాలయ చట్టం-2010 ద్వారా స్థాపించబడింది. 2007లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చట్టం ఏర్పాటు చేసింది. మొత్తం 40 తరగతి గదులు, 1900 మంది విద్యార్ధులకు సీటింగ్ ఏర్పాటు, రెండు అకడమిక్ బ్లాకులు ఉన్నాయి. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో 300 సీట్ల కేపాసిటి ఉన్న రెండు ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, అంతర్జాతీయ కేంద్రం, యాంఫీథియేటర్ కూడా నిర్మించబడింది, ఇందులో 2 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form