నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సానియా మీర్జా..నెట్టింట వైరల్‌

Published on 

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇటీవలే భర్త నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటి నేమ్‌ ప్లేట్‌ను కూడా మార్చేసింది. తన పేరు పక్కన కుమారుడు ఇజాన్‌ పేరు ఉండేలా ‘సానియా ఇజాన్‌’ అంటూ నేమ్‌ ప్లేట్‌ను తయారు చేయించుకుని ఇంటి ముందు తగిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సానియా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కొన్ని గంటల క్రితం సానియా మీర్జా షేర్ చేసిన ఆ పోస్టుకు లక్షలాది లైక్స్ వచ్చాయి. వీటితో పాటూ హార్ట్ ఎమోటికాన్‌లను ఉపయోగించి చాలా మంది వైవిధ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని..

“మహిళలు విషపూరితమైన వ్యక్తులను, సంబంధాలను విడిచిపెట్టినప్పుడు భిన్నంగా ప్రకాశిస్తారు. మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు.

“బలమైన మహిళ. స్వతంత్ర మహిళ. గర్వించదగిన మహిళ,” అని మరొకరు కామెంట్ చేశారు.

“మీరు అన్ని సమస్యలను మీ స్వంతంగా నిర్వహించగలిగేంత బలంగా ఉన్నారు” అని ఇంకో వ్యక్తం చేశాడు.

“మీరు ఉత్తమ మహిళ,ఉత్తమ తల్లి. మీకు నేను నమస్కరిస్తున్నాను. నీపై గౌరవం, ప్రేమ విపరీతంగా పెరిగింది” అని మరొకరు కామెంట్ చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form