బంగ్లాదేశ్‌ ఎంపీ హ‌త్య ..ముగ్గురు అరెస్టు

Published on 

బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వ‌రుల్ అజిమ్ అనార్హ‌ హత్య‌కు గురయ్యాడు. కోల్‌క‌తాలోని ఫ్లాట్‌లో అత‌న్ని మ‌ర్డ‌ర్ చేసిన‌ట్లు అస‌దుజ్జ‌మాన్ ఖాన్ తెలిపారు. ఈ హ‌త్య కేసుతో లింకున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఎంపీ అన్వ‌రుల్‌ను హ‌త్య చేసిన ముగ్గురూ బంగ్లాదేశీలు అని , ప్లాన్ ప్రకారం మ‌ర్డ‌ర్ జ‌రిగింద‌ని మంత్రి వెల్ల‌డించారు. అయితే ఏ కార‌ణం చేత అత‌న్ని హ‌త్య చేశారో తెలియ‌ద‌ని, ఆ విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

జెనాయిదా-4 నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్వ‌రుల్ అజిమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జెనాయిదా బోర్డ‌ర్ ప్రాంత‌మ‌ని, అక్క‌డ క్రైం రేట్ ఎక్కువ‌గా ఉంటుంది. చికిత్స కోసం ఇండియా వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డ అత‌న్ని హ‌త్య చేశార‌ని బంగ్లా హోంమంత్రి తెలిపారు. అన్వ‌రుల్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని షేక్ హ‌సీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form