అక్షరాల నిప్పురవ్వ!

Published on 

నార్త్ బెంగాల్ మారుమూలలో పెరిగారు కదా బాల్యం ఎలా గడిచింది?

సిలిగురి పేరు వినే ఉంటారు కదా ఉత్తర బెంగాల్ లో మారు మూల ప్రాంతం. అమ్మా నాన్నా ఇద్దరూ ఊరికి దూరంగా టీ తోటల్లో పని చేసేవాళ్లు. నా బాధ్యత అంతా మా పిన్ని చూసుకునేది. స్కూల్‌కు వెళ్ల్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. కొంత దూరం పొలాల్లో నడుస్తూ, మరికొంత దూరం రిక్షాలో వెళ్లేదాన్ని ఆసమయంలో టమాటో రైతుల కష్టాలు చూశాను కనీస ధరపలకక ఆ టమాటోలని రోడ్డు మీద పడేసినప్పుడు బాధకలిగింది. బహుశా అది నా మొదటి రాజకీయ స్పృహ కలిగించిన సందర్భం అనుకోవాలి. నేను స్కూలుకి వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు ఆ తోటల్లో పని చేసేవాళ్లంతా నాతో చాలా ప్రేమగా మాట్లాడేవాళ్లు. పేదరికం, ఒంటరితనం, పొలాలూ, మట్టిదారులూ, స్కూల్…. ఇలా బాల్యం గడిచిపోయింది.

రాజకీయ కవిత్వం రాయటానికి మిమ్మల్ని పురిగొల్పిన పరిస్థితులేమిటి?

రాజకీయాలని ఫాలో అవుతాను, రాజకీయ స్పృహ ఉన్నదానినే. కానీ కవిత్వం రాయటం మొదలు పెట్టింది మాత్రం 2019లో. ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి హింస నన్ను కదిలించి వేసింది. అక్కడ అంత హింస జరుగుతుంటే ఎవరూ గట్టిగా మాట్లాడకపోవటం బాధించింది. ఆ సమయంలో వాళ్ల గురించిన నా బాధని ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆ విషయాలు మాట్లాడటానికి ఇష్ట పడేవాళ్లుకాదు. నా లోపల ఉన్న బాధని, వాళ్ల పట్ల నా సంఘీభావాని చెప్పటానికి ఏ మార్గం తోచలేదు. ఆ సమయంలో కవిత్వం మొదలు పెట్టాను.

మొదటి పుస్తకం ‘ద మ్యూజింగ్స్ ఆఫ్ ద డార్క్‘ లోకవితలకి ప్రేరణ ఏమిటి? ఒక ముస్లిం అమ్మాయిగా సీఏఏ మీద నిరసన కవిత్వం అనుకోవచ్చా?   

ముందుగా నేను రాజకీయంగా ఒక ముస్లిం అమ్మాయినే కానీ పర్సనల్‌గా మరీ అంత మతభావాలతో నిండిపోయిలేను. సీఏఏ బిల్ నేపథ్యంలో ఏర్పడ్ద అనిశ్చిత వాతావరణం కూడా నన్ను ఒక రకమైన అబధ్రతా భావంలోకి తోసినట్టు అనిపించింది. నేను కమ్తాపురీ అనే శాఖకు చెందిన ముస్లిం అమ్మాయిని మా  మూలాలు తాతముత్తాతల కాలం నాడు బంగ్లాదేశ్ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. కానీ నేనెప్పుడూ బంగ్లాదేశ్ వెళ్లలేదు. నేనే కాదు మానాన్న, వాళ్లనాన్నకూడా ఇదే దేశంలో ఉన్నారు. కనీసం అక్కడవాళ్లలో ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు కూడా లేరు. నాది ఈ దేశమే. కానీ సడెన్‌గా నేను ఈదేశస్థురాలినే అని నిరూపించుకో అని అంటే నేనేం చేయగలను?  ఆ బాధని నేను ఎలా చెప్పగలను? వేదికలమీదా, పెద్ద పెద్ద సమావేశాల్లో మాట్లాడే అవకాశం కూడా నాకు లేదు అందుకే కవిత్వాన్ని ఎంచుకున్నాను.

అలాగే కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో వలసకూలీల నడక, వాళ్ల దీన స్థితీ నన్ను ఆవేదనకు గురి చేశాయి. నా కూతురితో ఒక్కదాన్నే ఉండి ఇంటికి వెళ్లలేని స్థితిలో వేల కిలోమీటర్లు నడిచిన వాళ్లని తల్చుకుంటే కన్నీళ్లొచ్చేవి. అదే నా కవిత్వం అయ్యింది. అలా ‘ద మ్యూజింగ్స్ ఆఫ్ దడార్క్‘ 2020లో వచ్చింది. అప్పటి నుంచీ నేను రాస్తున్న కవితలు ఔట్ లుక్ లాంటి పత్రికల్లో రావటం మొదలైంది.

కచ్చితంగా… నేను చందమామ అందం గురించి రాయటానికి రాలేదు. నేను బుజ్జగించటానికో, బతిమాలటానికో రాయటం లేదు. ప్రశ్నిస్తున్నాను, ఎదిరిస్తున్నాను. అలాంటప్పుడు నేను సున్నితమైన భాషలో ఎలా రాయగలను? ఫాసిస్ట్ స్టేట్‌ని ప్రశ్నించేటప్పుడు ఇది చాలా అవసరం అని నేననుకుంటాను. చంద్రుని అందం గురించి రాయటాంకి నేను రాలేదు. 

ప్రేమ పొలిటికల్ విషయం కాదని ఎలా అనగలం? ఈ దేశ రాజకీయాలు ప్రేమ చుట్టూ కూడా ఉన్నాయి కదా. ఒక కవయిత్రిగా నేను అందాన్ని ఇష్టపడతాను. ఆ అందాన్ని నేను దుఃఖాన్ని వర్ణించటానికి వాడతాను. చందమామని చూస్తున్నప్పుడు కూడా నేను నిలబడ్డ నేలని మర్చిపోను. నా ప్రేమ కవితలు కూడా రాజకీయ కవితలే.

నేను ఉండే ప్రదేశం కలకత్తాకి చాలా దూరం ఇంచుమించుగా వెయ్యి కిలోమీటర్ల దూరం. కలకత్తా మాకు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రాజధాని. మొత్తం బెంగాల్లో అలాంటి సిటీ ఇంకొకటి లేదు. బహుశా నా కవిత్వం కలకత్తాలో ఉండే బెంగాలీలకు చేరటానికి సమయం పడుతోందేమో. ఇప్పటివరకూ ఎవరూ బెంగాలీలోకి అనువదించలేదు. భవిష్యత్‌లో ఎవరైనా చేస్తారేమో చూడాలి.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాసే కవిత్వానికీ, సాహిత్యానికీ ఈ సమస్య ఉంది. తెలుగులో కూడా రమా సుందరి, వేణుగోపాల్, విమల లాంటి కొందరు సాహసించి ఇలాంటి కవిత్వాన్ని ప్రజలకు చేరుస్తున్నారు. కానీ మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి. నేను నా ఎనిమిదేళ్ల కూతురు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నపుడు అనిపించింది. మనమూ ఈ మాధ్యమాన్ని వాడుకోవచ్చు కదా అని. చిన్న కవితలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టే అందరికీ సులభంగా చేరే రీల్స్ ని కూడా వాడుకోవచ్చు అనిపించింది. మన ఆలోచనలని ప్రపంచానికి చేరవేసే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు.  మనం ఎదుర్కోవాలనుకుంటున్న ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు. వాళ్ల చేతుల్లో డబ్బు, అధికారం, మీడియా ఉన్నాయి. అందుకే మనం ఆ మార్గాలకు భిన్నమైన మార్గాలలో ప్రజలను చేరుకోవాలి. నిజానికి ఇది కార్పోరేట్ శక్తులు నడిపిస్తున్న ప్రజాస్వామ్యం మనం పోరాడుతున్నది ఆ కార్పోరేట్లతోనే.

చాలా…. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు రెండూ నన్నూ నా సాహిత్యాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాయి. అయినా ఈ సాహిత్య అనుబంధం ఇప్పటిది కాదుకదా ఎన్నో ఏళ్లుగా బెంగాలీ సాహిత్యాన్ని తెలుగువాళ్ళు చదువుతున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు తెలుగు, తెలంగాణ వాసులు సైద్దాంతికంగా కూడా బలంగా నిలబడ్డారు ఇది ఎంతో ధైర్యాన్నిచ్చే విషయం.  ఇలాంటి కల్లోల వాతావరణంలో, నాకూ హైదరాబాద్‌లో ఇంత మంది ఆత్మీయులున్నారని, ఇంత ప్రేమగా చూసుకునే మనుషులున్నరనీ ఆనందంగా ఉంది. వీళ్లంతా కేవలం నన్ను మాత్రమే కాదు నా ఆలోచనలనీ, నేను అనుసరిస్తున్న మార్గాన్నీ ఇష్టపడ్డారు. .  విమలగారూ, నా కవిత్వాన్ని తెలుగులోకి అనువదించిన వేణుగోపాల్, మాతృకలో ప్రచురించిన రమా సుందరి, పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చిన ఉదయమిత్రగారూ, నన్ను ప్రేమగా చూసుకున్న జ్యోతి,  సంధ్య… ఇలా ప్రతీవాళ్లు చూపించిన ప్రేమని ఎలా మర్చిపోగలను?

ఇప్పటికి మూడు పుస్తకాలు వచ్చాయి. ద మ్యూజింగ్స్ ఆఫ్ ద డే బ్రేక్, స్మెల్ ఆఫ్ ఆజాదీ, ద మ్యూజింగ్స్ ఆఫ్ ద డార్క్. వీటిలో రెండు పుస్తకాలు తెలుగు తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘రాయగూడని పద్యం‘ పేరుతో ఉదయమిత్ర తెలుగులోకి అనువదించారు. ఇక పొలిటికల్ అంశాలమీద రాసిన వ్యాసాలు ఔట్ లుక్, వైర్ లాంటి పత్రికల్లో చాలానే వచ్చాయి. 

ఇంటర్య్వూ : సూఫీ

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form