మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల

Published on 

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024- 2025 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10 వ తేదీ నుంచి ప్రవేశాల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31. పదో తరగతి అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్ మొదటి సంవత్సరం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అడ్మిషన్ల ప్రకటన – తెలంగాణ మోడల్ స్కూల్.
  • ప్రవేశాలు – ఇంటర్ ఫస్ట్ ఇయర్(ఇంగ్లీష్ మీడియం)
  • తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలు కల్పిస్తారు.
  • ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
  • అర్హత – పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు విధానం – ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం – 10, మే, 2024.
  • దరఖాస్తులకు తుది గడువు -31 మే , 2024.
  • ఎంపిక విధానం – పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ – https://telanganams.cgg.gov.in/

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form