గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..22 మంది సజీవ దహనం

Published on 

గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న ఓ గేమింగ్ జోన్ లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఆ మంటల్లోకి చిక్కి 22 మంది సజీవదహనమైనట్లు, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ ప్రమాదంపై కేంద్రం విచారం వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, మంటల్లో చిక్కి గాయాలపాలైన క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వారికి మెరుగైన చికిత్స అందిచాలన్నారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form