గ్రౌహౌండ్ అదుపులో ఉన్న 6గురిని కోర్టు ముందు హాజరుపర్చాలి : మావోయిస్టులు

Published on 

TS: ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాలా గ్రామం వద్ద గ్రేహౌండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లను కోర్టు ముందు హాజరుపర్చాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే 12వ తేదీ 10గంటల సమయంలో తడుపాల గ్రామం వద్ద గ్రేహౌండ్ పోలీసులు రీతా, మోతీ, ఇడ్మాల్ అనే ముగ్గురు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారని, వారితో పాటూ పనుల రీత్యా అడవికి వెళుతున్న మరో ముగ్గురిని కూడా పట్టుకొని ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, బాంబుల గురించి సమాచారం తెలపాలనీ వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నాని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను 24 గంటల్లోగా కోర్టుముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, గ్రౌహౌండ్ అదుపులో ఉన్న 6గురిని వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొ.జి.లక్ష్మణ్, నారాయణ రావులు ఒక ప్రకటనలో కోరారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form