అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా : కేసీఆర్

Published on 

  • ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది.
  • తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం.
  • అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా.
  • బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం

పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందన్నారు దీనికే ఏదోక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని..త్వరలో తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటానన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

తెలంగాణలో బీజేపీకి ఒకటీ లేదా సున్న సీటు వచ్చే పరిస్థితి ఉందని, దక్షిణాదిలో అయితే 10 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఉత్తర భారతంలోనూ కాషాయ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంటుందని..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగైదు నెలల్లోనే.. కరెంట్ సరిగ్గా లేదు, మంచినీటి సరఫరా లేదు. మరి ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form