మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్

Published on 

కన్నడ స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు దర్శన్ ను మైసూరు ఫామ్ హౌస్ లో ఉండగా నేడు ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. దర్శన్ కు పెళ్ళైనా పవిత్ర గౌడ అనే నటితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్‌లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని, పవిత్ర ఈ విషయం దర్శన్‌కు చెప్పడంతో దర్శన్ రేణుక స్వామిని మర్డర్ చేయించినట్లు తెలుస్తుంది.

ఈ మర్డర్ లో ఇప్పటికే కొంతమంది పోలీసులకు దొరకగా వాళ్ళు దర్శన్ చెప్తేనే చేసినట్టు, తమకు ఏం తెలీదని, దర్శన్ చంపమని చెప్తేనే ఈ పని చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసారని సమాచారం. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్శన్ కానీ, అతని ఫ్యామిలీ కానీ ఇంకా ఎవరూ స్పందించలేదు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form