పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ న్యూస్ నివేదిక ప్రకారం.. పాపువా న్యూ గునియా రాజధాని పోర్ట్ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్ లోని కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద మృతదేహాలను తొలగించేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.