Hyd: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు.
