ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మరో ఎన్ కౌంటర్‌లో

Published on 

  • 8 మంది మావోయిస్టులు మృతి
  • గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ ఆపరేషన్
  • ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ – నక్సల్స్ ఆపరేషన్ చేపట్టగా ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లిలో 8 మంది మావోయిస్టుల మృత‌దేహాల‌ను అలాగే భారీగా ఆయుధాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ఎవ‌రికీ గాయాలు కాలేదని పిడియా గ్రామ ప‌రిస‌రాల్లో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొన‌సాగుతోందని సమాచారం.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form