నవనీత్ కౌర్‌పై కేసు నమోదు

Published on 

బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ లోక్ స‌భ‌ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా నిర్వ‌హించిన‌ రోడ్డు షో లో నవనీత్ కౌర్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్‌కు ఓటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లైయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్ షో అనుమతి తీసుకున్న బాధ్యులతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఎంపీ నవనీత్ కౌర్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరవకముందే మరో వివాదంలో చిక్కుకోవడం పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తుంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form