చైనా జర్నలిస్ట్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

Published on 

చైనాలో మీటూ ఉద్య‌మం చేప‌ట్టిన ప్ర‌ఖ్యాత మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష ప‌డింది. 14 జూన్ శుక్ర‌వారం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌ న్యాయస్థానం “రాజ్యాధికారాన్ని అణచివేయడానికి ప్రేరేపించడం” అనే ఆరోపణపై చైనీస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హువాంగ్ జూకిన్ (సోఫియా హువాంగ్)కి 5 సంవత్సరాల జైలు శిక్ష విధింస్తూ తీర్పును వెలువ‌రించారు.

మీటూ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప‌ది నెల‌ల క్రితమే ఈ కేసులో విచార‌ణ జ‌ర‌గ్గా ఇప్పుడు తీర్పును ఇచ్చారు. సోఫియాతో పాటు మ‌రో కార్య‌క‌ర్త వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. లైంగిక వేధింపుల బాధితుల గురించి రిపోర్టింగ్ చేస్తూ 36 ఏళ్ల హువాంగ్ చైనాలో మీ టూ ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. చైనా మీడియాల్లో జ‌రుగుతున్న వేధింపుల గురించి కూడా ఆమె ధైర్యంగా మాట్లాడేది. మీటూ ఉద్య‌మం ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్న చైనా అధికారులు ఆమెను 2021లో అరెస్టు చేశారు. దాదాపు వెయ్యి రోజుల పాటు క‌స్ట‌డీలో ఉన్నారు. సెప్టెంబ‌ర్ 2023లో ఆ ఇద్ద‌రిపై కోర్టు విచార‌ణ మొద‌లైంది. బ్లాక్ జెళ్లుగా పిలువ‌బ‌డే ర‌హ‌స్య ప్ర‌దేశాల్లో వాళ్లు బంధీ చేశారు

హువాంగ్ 2018లోనే మహిళల హక్కులు, అవినీతి నుండి పారిశ్రామిక కాలుష్యం వరకు అనేక అంశాలను కవర్ చేస్తూ కథనాలను ప్రచురించింది. మీడియా పరిశ్రమలో లింగ ఆధారిత వేధింపుల ప్రాబల్యాన్ని వెల్లడిస్తూ సర్వేలు నిర్వహించింది. లైంగిక వేధింపులపై అవగాహన తీసుకురావడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను వేదికగా ఉపయోగించుకుంది.

2019లో, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను కవర్ చేసినందుకు “కలహాలు చేయడం, ఇబ్బందులను రెచ్చగొట్టడం” అనే ఆరోపణ కింద హువాంగ్‌ను మూడు నెలల పాటు నిర్బంధించారు చైనా పోలీసులు. అయినప్పటికీ వెరువకుండా మీటూ ఉద్యమంలో పాల్గొంది హువాంగ్.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form