స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Published on 

జైపూర్‌లోని నాలుగు సూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్‌ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. మెయిల్ అందిన వెంటనే పాఠశాలలోని విద్యార్థులను బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు అధ్యాపలకు. అయితే రాజస్థాన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం మరువలకు ముందే స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తుంది.

మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్‌కు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మొదట బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే మల్పుర్‌గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ రావడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. అయితే జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form