బ్రిటన్‌ ప్రధానిని కలిసిన మనీషా కోయిరాల

Published on 

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ను బాలీవుడ్‌ స్టార్‌ నటి మనీషా కోయిరాల కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

యూకే – నేపాల్‌ బంధానికి (UK – Nepal Friendship) 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్‌ తరఫున హాజరయ్యారు.

మనీషా కోయిరాలది నేపాల్‌లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్‌కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. జన్మత: నేపాలీ కాబట్టి ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్‌ తరఫున హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఫొటోలను నటి షేర్‌ చేస్తూ.. ‘‘ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. నేపాల్‌ గురించి బ్రిటన్‌ ప్రధాని ఎంతో అభిమానంగా మాట్లాడటం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని’’ పేర్కొన్నారు. నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు ట్రెక్కింగ్‌కు రావాలని పీఎం, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించినట్లు మనీషా కోయిరాల తన పోస్ట్‌లో వెల్లడించారు.

కాగా, కొన్నేళ్ల విరామం తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’లో మనీషా కోయిరాల కనిపించారు. ఈ సినిమాలో మల్లికాజాన్‌ పాత్రలో ప్రేక్షకులను అలరించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form