అడ్డంగా బుక్కైన హేమ..డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్

Published on 

.బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్ప‌టికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజకీయ నాయకులు ఉన్న‌ట్లు బెంగ‌ళూరు పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే టాలీవుడ్‌కు చెందిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది. ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాము ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని , మేం అలాంటి వాళ్లం కాదని వీడియో బైట్‌లు వదిలారు.

కానీ హేమ విషయంలో ఆమె ప్రదర్శించిన అత్యుత్సాహం ఆమెను అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. తన‌కు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుద‌ల చేసిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసుల‌కు ఆధారం దొరికిన‌ట్ల‌యింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో.. హేమ విడుద‌ల చేసిన వీడియో ఒకేలా ఉండ‌డంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా పోలీసుల విచార‌ణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా హేమ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ‌తో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక ఈ సంఘటనపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form