దంతెవాడ (ఛత్తీస్‌గఢ్), మే 24: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ముగ్గురు మావోయిస్టులు పోలీసు సూపరింటెండెంట్ ఎదుట లొంగిపోయారు. ముగ్గురిలో ఒకరు మహిళా నక్సలైట్ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురూ నీల్వాయ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా చత్తీస్‌గడ్‌లో భద్రతా దళాలు మావోయిస్టులను వేటాడమే టార్గెట్‌గా అడవిని జల్లెడ పట్టి.. తుపాకులతో విరుచుకుపడుతున్నాయి వీలైతే ఏరివేయడం లేదంటే సరేండర్ చేయడం అన్నట్లుగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ 113 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు.