ఎమ్మెల్యే కారు ప్రమాదం…ఇద్దరు మృతి

Published on 

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా గ్రామ శివారులో కారు ఓ బైకును ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వెంకటాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నరేశ్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, పరుశురామ్ అనే యువకుడు ఆసత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. ఎయిర్ బెలూన్‌లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form