కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపగా.. ఆయన శామ్ పిట్రోడా రాజీనామాను ఆమోదించారు. భారత్లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పిట్రోడా వాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించింది.
ఇటీవల శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వివాదం సద్దుమనగక ముందే ఆయన బుధవారం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తీవ్రంగా ఖడించారు ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.