హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగానికని వచ్చిన యువతిపై ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అమీర్పేట్లో చోటు చేసుకుంది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్ సెలెక్ట్ అయ్యావని, ఆఫీసు సిమ్ కార్డ్ ఇంటికి వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో ఆ యువతి సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వచ్చిన యువతిపై ఇదే అదనుగా భావించిన కామాంధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. నిందితుడు నవీన్ కుమార్ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.