శ్రీనగర్: ఉధంపూర్ జిల్లాలోని నార్సూ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైంది, డ్రైవర్ గాయపడగా, మరో నలుగురు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.
పహల్గామ్ వైపు యాత్రకు వెళుతున్న HR 40H 6485 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన వాహనం ఉదయం 6:17 గంటలకు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
గాయపడిన డ్రైవర్‌ను హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ప్రేమ్ చంద్ కుమారుడు శశికాంత్‌గా గుర్తించారు. అతని తలకు గాయమవ్వడంతో వెంటనే ఉధంపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు జమ్మూ కాశ్మీర్ న్యూస్ నెట్ వర్క్ వార్తా సంస్థ (JKNS) తెలిపింది.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ నిద్రమత్తులో వుండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో తేలింది. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
