న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద జరిగిన మర్డర్ కేసులో రెజ్లర్ సుశీల్ జైలుశిక్ష ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఓ ప్రాపర్టీ విషయంలో రెజ్లర్ల మధ్య వివాదం చెలరేగింది. మే 2021లో ధన్‌కర్‌పై సుశీల్ కుమార్‌తో పాటు ఇతరులు దాడి చేశారు. ఆ ఘటనలో ధన్‌కర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ధన్‌కర్ తలకు తీవ్రగాయమైంది.
అయితే మార్చి 4వ తేదీన ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సుశీల్‌కు బెయిల్ మంజూరీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలకు చెందిన సుప్రీం ధర్మాసనం ఆ బెయిల్‌ను రద్దు చేసింది. వారం లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
