పాలు ఆరోగ్యానికి అవసరమైన మంచి పౌష్టికాహారం అంటారు. సంపూర్ణ ఆరోగ్యానికి పాలు తప్పనిసరి అని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. పాలలో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితో పిల్లల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. ఎదిగే పిల్లలు పాలు తాగితే మంచిదంటారు. పాలలో విటమిన్ డి ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం. అయితే,వాస్తవానికి పాలు చల్లగా లేదంటే, వేడిగా తాగాలా అనే సందేహం కూడా చాల మంది వ్యక్తం చేస్తుంటారు. పాలు వేడిగా, చల్లగా తాగడం వల్ల ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు పాలను చల్లగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. చల్లని పాలు శరీరంలో జీవక్రియను పెంచుతాయి. దీని వలన బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు. చల్లని పాలు శరీరంలో జీవక్రియను పెంచుతాయి. దీని వలన బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.వ్యాయామం చేసిన తరువాత చల్లని పాలు తాగితే మంచిదని వైద్యులు సలహా ఇస్తారు. ఇది కండరాలను బాగుచేస్తుందని అంటున్నారు.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చల్లని పాలు తాగడం మంచిదని నిపుణులు చెబతున్నారు. ఇది ఎముకలను బలంగా చేస్తుందని అంటున్నారు. రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగితే చాలా మంచిది. ఇది మంచి నాణ్యతతో కూడని నిద్ర పట్టేలా చేస్తుందని చెబుతున్నారు. వేడి పాలు చల్లని పాల కంటే త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి పాలు తాగడం మంచిదని అంటున్నారు. వేడి పాలు శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. అందుకే రోజూ పాలు తాగమని వైద్యులు చెబుతారు. వెచ్చని పాలు గుండె ఆరోగ్యానికి కూడా మంచివే.
