బీజాపూర్: ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన IED పేలి ఇద్దరు STF జవాన్లు గాయపడినట్లు సమాచారం.
14 వ రోజు కొనసాగుతున్నఈ ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన సైనికులను వెంటనే శిబిరానికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన సైనికులలో ఒకరి పేరు థాన్సింగ్, మరొక సైనికుడి పేరు అమిత్ పాండేగా సమాచారం. అయితే నక్సల్ ఏరివేత పూర్తయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
