గద్వాల: ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదు.
తాజాగా గద్వాల ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తినడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.























