అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను నుంచి అమెరికన్లను విముక్తి కలిగిస్తానని ప్రకటించారు. ఏకంగా పన్ను చెల్లింపుల నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై అమెరికాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ పన్ను నుంచి విముక్తి కలిగించడమంటే సంపన్నులకు లబ్ధి చూకూర్చడమేనని కొంతమంది విమర్శిస్తున్నారు. పన్ను స్థానంలో టారిఫ్‌ల పాలసీని అమల్లోకి తీసుకురావడమంటే.. దిగువ, మధ్య తరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీయడమేనని మరికొంతమంది ఆరోపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదనలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో విదేశాంగ విధానంలో సుంకాలను బహుముఖ అస్త్రంగా ప్రయోగించాడు. అయితే ఈ ఎన్నికల రేసులో పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు.