శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ గాయపడ్డారు.
కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. మృతులు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.
