Hyd: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టు సీనియర్, కీలక నేతలు శుక్రవారం లొంగిపోయారు. ఇందులో సిద్దిపేట జిల్లా వాసి కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్, మొగిలిచర్ల చందు అలియాస్ వెంకట్రాజు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోడెం గంగ అలియాస్ సోనీ ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్ దళంలో కీలక స్థానంలో పని చేశారన్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల్లో విభేదాలు పెరిగాయని.. రానున్న రోజుల్లో మరికొందరు కూడా లొంగిపోయే అవకాశం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మిగతా వారు కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.
