శ్రీనగర్: ఢిల్లీ కారు బాంబు పేలుడుపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుపై అనుమానం వున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల నుండి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సహా సుమారు 10 మందిని అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.
సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో దర్యాప్తు అధికారులు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లో దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్టు చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిలో కొందరు గత ఏడాది తుర్కియేను సందర్శించారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని, విస్తృత నెట్‌వర్క్‌తో సంబంధాల కోసం ఇప్పుడు ఆ వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.























