శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి పొన్నం

Published on 

కామారెడ్డి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కర్రెగుట్టలో నక్సల్ వున్నారని కూబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున సమయంలో నక్సల్స్ అమర్చిన మందుపాతన పేలి ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ మరణించిన విషయం తెలిసిందే.

పోలీసు వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి రూ.2.17 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందినున్నట్లు తెలిపారు.

తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, ఓఎస్‌డీ దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్‌పీ శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వీ విక్టర్, ఆర్డీవో వీణ, పోలీసు, రెవిన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form