AP: ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు. అనంతరం ఆయన చిన్న కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సోహెల్ బెంగుళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ పేరుతో ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొద్దిరోజుల కిందట సోహెల్ బ్యాంకు అకౌంట్‌కు భారీ నిధులు రావడంతో అతడి ఫ్యామిలీ సభ్యులను విచారణ చేస్తున్నారు అధికారులు. సోహెల్‌కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.