- హీరో అజిత్ కారుకి యాక్సిడెంట్
- దుబాయ్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్‌లో ఘటన
- అజిత్ క్షేమం అంటూ తెలిపిన టీమ్
హీరో అజిత్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. దుబాయ్ గ్రాండ్ ప్రిక్స్ రేసులో పాల్గొనేందుకు వెళ్లారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రాక్ పై గిర్రున తిరిగి ముందు భాగం డ్యామేజ్ అయింది. భద్రత సిబ్బంది తక్షణమే స్పందించి ఆయన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత తనను వేరే కారులో తరలించారు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డప్పటికీ అజిత్‌కు స్వల్పంగా గాయమైనట్టు తెలుస్తోంది.