నేవీ రాడార్‌ పనులను ఆపండి… సీజేకు విజ్ఞప్తి

Published on 

TG: వికారాబాద్‌ జిల్లా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొనసాగుతున్న వీఎల్‌ఎఫ్‌ నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్‌ రాంకల్యాణ్‌ చల్లా విజ్ఞప్తి చేశారు.

దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 2021లో ఇచ్చిన స్టేటస్‌కోను కొనసాగించాలని కోరారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతోపాటు నేవీ అధికారుల నివాసానికి సంబంధించి నరికిన చెట్ల స్థానంలో నాటిన 2,500 మొక్కల్లో 90 శాతం మొక్కలు లేనేలేవని, మొక్కలను పెట్టి వదిలేశారని తెలిపారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బోర్లు వేయబోమని చెప్పిన నేవీ అధికారులు.. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 11 బోర్లు వేశారని పేర్కొన్నారు.

మరోవైపు నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 2017లో తుది అనుమతులురాగా, 2020 వరకు రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రమాదంలో పడకుండా 11 లక్షలకుపైగా మొక్కలను నాటాలని ఫారెస్ట్‌ అధికారులను కోర్టు ఆదేశించి ఏడేండ్లు దాటినా ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు భూమిని కూడా గుర్తించలేకపోయారనే విషయాన్ని సీజేఐకు విన్నవించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form