కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Published on 

రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బగీషా తివారీ (Bagisha Tiwari) అనే 18 ఏళ్ల యువతి తన తల్లి, సోదరుడితో కలిసి కోటాలోని జవహర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు సిద్ధమవుతున్న ఆమె కోటాలో కోచింగ్‌ తీసుకుంటోంది. అయితే మంగళవారం NEET-UG ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత బుధవారం సాయంత్రం యువతి తాను ఉంటున్న భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహారావ్‌ భీమ్‌ సింగ్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి మృతికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 11వ ఘటన. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form