- రాత్రి 8.50కి క్యూలైన్‌లోకి అనుమతి
- ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు
- ఒక్కసారిగా తోపులాట.. నలిగిన భక్తులు
- టీటీడీ చరిత్రలో తొలిసారి దుర్ఘటన
తిరుపతి: ‘తిరుమల’ చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది! తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో… పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా… వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
తొక్కిసలాట ఘటనలో మృతులు బుద్దేటి నాయుడుబాబు (51) నర్సీపట్నం, మల్లిక (47), రజని (47) , శాంతి (40), రాజేశ్వరి, నిర్మలగా గుర్తించారు.