శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో చలి పంజా విరుచుకుపడుతుంది. సీజన్లో అత్యంత కనిష్ట స్తాయిలో మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఖాజిగుండ్ వద్ద మైనస్ 1.4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడగా, పహల్గామ్లో మైనస్ 2.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రసిద్ధ స్కై -రిసార్ట్ రిసార్ట్ అయిన గుల్మార్గ్లో కనిష్టంగా మైనస్ 0.6 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జమ్మూ, కాశ్మీర్లో నవంబర్ 23 వరకు పొడి వాతావరణ పరిస్థితులను వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే కాలంలో మరింత తగ్గే అవకాశం వున్నట్లు అంచనా వేస్తున్నారు.