పెద్దపల్లి దారుణం.. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య

Published on 

TS: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తన పక్కన బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులతో కలిసి పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో విగత జీవిగా పడిఉన్న ఆమెను గుర్తించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు బాలికను ఎత్తుకెళ్తున్న దృష్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form